Anand Mahindra – dancing Cop ranjith Singh | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటాడు. అలాగే అప్పుడప్పుడు మోటివేషన్ అంటూ మంచి వీడియోలు షేర్ చేస్తుంటాడు. తాజాగా ఆనంద్ మహీంద్రా డ్యాన్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ వీడియోను షేర్ చేశాడు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజిత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత 16 ఏండ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అందరూ చేతులతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం తన డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తాడు. ట్రాఫిక్‌లో ఆగి ఉన్న జనాలకు తన స్టెప్పులతో అలరిస్తాడు. అయితే రీసెంట్గా రంజిత్ సింగ్ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా. తన వీడియోను షేర్ చేస్తూ మండే మోటివేషన్ అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోలీస్ బోరింగ్ పని అంటూ ఏమి ఉండదు అని నిరుపించాడు. మన పనిని మనం ఎలా చేయాలి అనేది నీ ఛాయిస్ అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This cop proves that there is NO such thing as boring work.
It is whatever you choose to make of it.#MondayMotivation
— anand mahindra (@anandmahindra) July 29, 2024
Also Read..