లండన్ : బ్రిటిష్ జూనియర్ ఓపెన్‌లో భారత స్టార్ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11-4, 10-12, 11-9, 11-3తోబార్బ్ సమెహ్(ఈజిప్టు)పై అద్భుత విజయం సాధించింది.
ఇప్పటికే టోర్నీలో మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన అనాహత్సింగ్ నాలుగోసారి ట్రోఫీపై కన్నేసింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరుస్తూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మరోవైపు అండర్-17 ఏషియన్ చాంపియన్ ఆర్యవీర్ దేవాన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు.