DD Anchor | కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎండల తీవ్రత గురించి వార్తలు చదువుతూ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలోనే దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా కుప్పకూలిపోయారు. తన పరిస్థితిని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో వివరిస్తూ, హఠాత్తుగా తన బ్లడ్ ప్రెషర్ వేగంగా తగ్గిపోయిందని, కుప్పకూలిపోయానని చెప్పారు.
ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే తన ఒంట్లో నలతగా అనిపించిందని తెలిపారు. అది ప్రత్యక్ష ప్రసారం కావడంతో తాను ఎక్కువసార్లు నీటిని తాగలేకపోయానని తెలిపారు. క్రమంగా తన కళ్లు చీకట్లు కమ్మాయని, తాను చూడలేకపోయానని చెప్పారు. తన మాటలు తడబడ్డాయని, చివరికి టెలిప్రాంప్టర్ మసక మసకగా కనిపించిందన్నారు.