న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పీఎఫ్ ఖాతాను కనీసం 20 ఏండ్ల పాటు నిరాటంకంగా కొనసాగిస్తే ఈపీఎఫ్వో అదనంగా రూ.50వేల నగదు జమ చేస్తుంది. లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద ఈ నగదును జమచేస్తారని ఆర్థిక నిపుణులు తెలిపారు. అందుకే ఉద్యోగాలు మారినప్పుడు కూడా పీఎఫ్ ఖాతాను రెగ్యులర్గా మెయింటెన్ చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద రూ.7 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు.