సవాళ్లను ఇష్టపడతా

‘నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రను ఈ సినిమాలో చేశా. స్నేహానికి అమితంగా విలువనిచ్చే యువతిగా విభిన్నంగా నా క్యారెక్టర్ సాగుతుంది’ అని చెప్పింది అమృతా అయ్యర్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. శ్రీవిష్ణు హీరోగా నటించారు. తేజ మార్ని దర్శకుడు. ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అమృతా అయ్యర్ పాత్రికేయులతో ముచ్చటిస్త్తూ ‘ఐదుగురు ప్రాణస్నేహితుల కథ ఇది. ఇందులో స్నేహితుడికి సాయం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే యువతిగా నేను కనిపిస్తా. నిజజీవితంలో ఇబ్బందుల్లో ఉన్న ఫ్రెండ్స్‌కు సాయపడుతుంటా. అందువల్లే క్యారెక్టర్‌తో బాగా కనెక్ట్ అయ్యా.
రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు తేజ మార్ని ఈ సినిమాను తెరకెక్కించారు. కుటుంబ విలువలతో పాటు చక్కటి థ్రిల్‌ను పంచుతుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడ్డాం. కొండలపై కొన్ని రోజులు షూట్ చేశాం. అక్కడకు వెళ్లడానికే ప్రతి రోజు మూడు గంటలు నడవాల్సివచ్చేది. నటిగా సవాళ్లతో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నా. గ్లామర్ పాత్రలు చేయను. ప్రస్తుతం ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేస్తున్నా’ అని చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

