న్యూఢిల్లీ: సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగనున్నది. ఈ కౌన్సిల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఉన్నాయి. కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. సరిహద్దు వివాదాలు, భద్రతతో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, రవాణా, పరిశ్రమలు, నీరు, విద్యుత్తుతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.