రాష్ట్రంలో ఆర్-ఆర్ ట్యాక్స్ దందా
తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానం ఏటీఎంలా మార్చుకున్నదని, రాష్ట్రంలో యథేచ్ఛగా ‘ఆర్ఆర్ ట్యాక్స్' వసూళ్లు సాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్‌రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదని, రాహుల్‌గాంధీ కోసమే రేవంత్‌రెడ్డి ఇకడ వసూళ్లకు పాల్పడుతూ ‘రాహుల్ రేవంత్ ట్యాక్స్'గా మార్చారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ చేపట్టిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం..
- రాహుల్ కోసమే రేవంత్ వసూళ్లు
- కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిచోటా అవినీతే
- మహాపాదయాత్ర ముగింపులో కేంద్ర మంత్రి అమిత్ షా
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానం ఏటీఎంలా మార్చుకున్నదని, రాష్ట్రంలో యథేచ్ఛగా ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లు సాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్‌రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదని, రాహుల్‌గాంధీ కోసమే రేవంత్‌రెడ్డి ఇకడ వసూళ్లకు పాల్పడుతూ ‘రాహుల్ రేవంత్ ట్యాక్స్’గా మార్చారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ చేపట్టిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచక వాదాన్ని అంతం చేద్దాం (లోక్తంత్ర బచావో.. అరాచకతా హటావో)’ పేరిట నిర్వహించిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా మొజాంజాహీ మారెట్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిచోటా ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతే రాజ్యమేలుతుందని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ సరార్ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలంతా తమకు అండగా నిలవాలని కోరారు.
చొరబాటుదారుల ఓట్లే కాంగ్రెస్ ఓటు బ్యాంక్
ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ బచావో’ ర్యాలీపై అమిత్ షా నిప్పులు చెరిగారు. అది ఓట్లను కాపాడే ర్యాలీ కాదని, దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన చొరబాటుదారులను కాపాడేందుకే చేపట్టారని ఎద్దేవా చేశారు. చోరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంక్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) వల్లే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ‘సర్’ లేదని, అప్పుడు నరేంద్ర మోదీ ఘనవిజయం సాధించలేదా అని నిలదీశారు. రాహుల్‌గాంధీ మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవుతారని నిజజీవితంలో ఎప్పుడూ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తాము గెలిచామని కాంగ్రెస్ పదేపదే నిందలు వేస్తున్నదని, అదే నిజమైతే తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పూర్తిగా ఉనికిని కోల్పోతున్నది
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిచోటా అవినీతి తాండవిస్తున్నదని, మాటిమాటికీ విదేశాలకు పారిపోయే నాయకులు దేశానికి అవసరం లేదని అమిత్‌షా అన్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా ఉనికిని కోల్పోయిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఊపిరి పీల్చుకుంటున్నని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు,కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ‘మహాపాదయాత్ర’లో కమలం జెండాలతోపాటు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల జెండాలు కూడా పెద్దసంఖ్యలో రెపరెపలాడాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

