మహేశ్వరం ‘బేస్’ ప్లాంట్‌కు రీటెండర్లు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏర్పాటు చేయతలపెట్టిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బేస్) ప్లాంట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు గతంలో పిలిచిన టెండర్లు రద్దవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో జెన్కో ఇటీవల మరోసారి టెండర్లను ఆహ్వానించింది. రీటెండర్ల దాఖలు గడువు పూర్తవడంతో మంగళవారం బిడ్లు తెరువనున్నారు. గతంలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు రాజకీయ పలుకుబడితో టెండర్లు దక్కించుకున్న ఓ సంస్థ అనూహ్యంగా వైదొలగింది.
- నేడు బిడ్స్ ఓపెన్ చేయనున్న జెన్కో
- గతంలో టెండర్ దక్కించుకుని చివర్లో చేతులెత్తేసిన సరస్ ఇన్ఫ్రా
- 750 మెగావాట్ల ప్లాంట్ ఆలస్యం
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏర్పాటు చేయతలపెట్టిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బేస్) ప్లాంట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు గతంలో పిలిచిన టెండర్లు రద్దవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో జెన్కో ఇటీవల మరోసారి టెండర్లను ఆహ్వానించింది. రీటెండర్ల దాఖలు గడువు పూర్తవడంతో మంగళవారం బిడ్లు తెరువనున్నారు. గతంలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు రాజకీయ పలుకుబడితో టెండర్లు దక్కించుకున్న ఓ సంస్థ అనూహ్యంగా వైదొలగింది.
లెటర్ ఆఫ్ అవార్డు జారీచేసిన తర్వాత తీరా ప్రాజెక్ట్ చేపట్టే సమయానికి చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు జెన్కో మళ్లీ టెండర్లు ఖరారు చేయనున్నది. వాస్తవానికి మహేశ్వరంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 750 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 బెస్ ప్లాంట్ల నిర్మాణానికి జెన్కో ఏడాది క్రితమే టెండర్లు పిలిచింది. ప్రైవేట్ సంస్థలు నెలకొల్పే ఈ ప్లాంట్లను ట్రాన్స్‌కోకు చెందిన ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది. ఒక్కో ప్లాంట్‌లో 187.5 మెగావాట్ల చొప్పున 4 గంటల నిల్వ సామర్థ్యంతో 750 మెగావాట్స్ ఫర్ అవర్ బ్యాటరీ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేసి, బిల్ట్ ఓన్ ఆపరేట్ (బీవోవో) విధానంలో 15 ఏండ్లపాటు నిర్వహించాలి. సోలార్, పవన విద్యుత్తును నిల్వ చేసుకుని, అవసరమైన సమయంలో గ్రిడ్‌కు అందించాలి. చౌటుప్పల్ ప్లాంట్ ఏర్పాటుకు 5 కంపెనీలు, మహేశ్వరం ప్లాంట్ ఏర్పాటుకు 16 కంపెనీలు ఆసక్తి చూపాయి.
ఏపీ కంటే టారిఫ్‌లు మన దగ్గరే ఎక్కువ
చౌటుప్పల్ బెస్ ప్లాంట్‌ను ఒక మెగావాట్‌కు నెలకు రూ.3.14 లక్షల టారిఫ్‌తో కోలిండియా కైవసం చేసుకున్నది. మహేశ్వరం ప్లాంట్‌ను నెలకు ఒక మెగావాట్‌కు రూ.2.98 లక్షల టారిఫ్‌తో హైదరాబాద్‌కు చెందిన సరస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రివర్స్ ఆక్షన్‌లో దక్కించుకున్నది. దీంతో ఆ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) కూడా జారీ చేశారు. ఏపీలో సగటు బిడ్ వ్యయం నెలకు ఒక మెగావాట్‌కు రూ.1.55 లక్షల నుంచి రూ.2.13 లక్షలు మాత్రమే. వీటితో పోలిస్తే తెలంగాణలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. కోలిండియా, సరస్ ఇన్ఫ్రా సంస్థలు ఎక్కువ కోట్ చేసినప్పటికీ జెన్కో టెండర్లు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు ప్లాంట్లకు వేర్వేరు టారిఫ్‌లు ఖరారు చేయడం, ఒకే గ్రిడ్ పరిధిలో ఒక మెగావాట్‌కు నెలకు రూ.16 వేల వ్యత్యాసం ఉండటంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 15 ఏండ్ల కాంట్రాక్టు వల్ల తెలంగాణ వినియోగదారులపై రూ.1.020 కోట్ల అదనపు భారం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. అయినప్పటికీ జెన్కో ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా టెండర్లు ఖరారు చేసింది.
గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక గుడ్‌బై
బేస్ ప్రాజెక్టులకు జెన్కో ఎల్ఏవో జారీచేయడంతో టారిఫ్, కొనుగోలు ఒప్పందాలకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇలా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక మహేశ్వరం ప్లాంట్ ఏర్పాటు విషయంలో సరస్ ఇన్ఫ్రా సంస్థ అనూహ్యంగా వెనక్కి తగ్గింది. దీంతో జెన్కో అధికారులు ఆ టెండర్లను రద్దు చేశారు. ఏపీలోని ఓ టీడీపీ నేతకు చెందిన సరస్ ఇన్ఫ్రా కంపెనీ రాజకీయ పలుకుబడితో ఈ టెండర్లు దక్కించుకున్నట్టు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఆ సంస్థ ముందుకు రాకపోవడంతో ఏడాదిపాటు జెన్కో చేసిన కసరత్తు వృథా అయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

