(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్ యుద్ధ విమానాన్ని వినియోగించింది. నిర్ణీత లక్ష్యాలను తుత్తునియలు చేయడంలో 100 శాతం సక్సెస్ రేటు కలిగిన ఈ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది కూడా. యూఎస్ రాకాసి విహంగంగా పిలిచే ఈ యుద్ధ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ప్రత్యేకతలకు కేరాఫ్..బీ-2
బీ-2ను తలదన్నేలా బీ-21
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలుగా పేరుగాంచిన బీ-2 స్థానంలో మరింత శక్తివంతమైన అడ్వాన్స్డ్ బీ-21 రైడర్లను తీసుకురావాలని అమెరికా భావిస్తున్నది. బీ-2 సాంకేతికత 1990నాటిది కావడం, రక్షణ రంగంలో చైనా, రష్యా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో అమెరికా ఈ యోచన చేస్తున్నది. బీ-2తో పోలిస్తే ఎన్నో విషయాల్లో బీ-21 మెరుగ్గా ఉండనున్నట్టు రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో రక్షణ రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా బీ-21ను తయారు చేయనున్నారు. సంప్రదాయ బాంబులతో పాటు అణ్వాయుధాలు, అణుబాంబులను మోసుకెళ్లే సామర్థ్యం దీనిలో ఉండనున్నట్టు భావిస్తున్నారు. అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీతో పాటు నిర్వహణ భారం కూడా తక్కువగా ఉండేలా దీన్ని రూపొందించనున్నారు. పైలట్ల అవసరం లేకుండా డిజిటల్ సిస్టమ్‌తో నడిచేలా రూపొందించనున్న ఈ బీ-21 నుంచి డ్రోన్లను కూడా ప్రయోగించవచ్చు. పరిధి, వేగం, సామర్థ్యం, సాంకేతికత ఇలా అన్ని విషయాల్లో బీ-2తో పోలిస్తే బీ-21.. కనీసం 30 ఏండ్ల అడ్వాన్స్డ్గా ఉండనున్నట్టు చెప్తున్నారు. తొలిదశలో కనీసం వంద బీ-21 రైడర్లను సిద్ధం చేసుకోవడానికి అమెరికా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.
07