తాండూరు : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ భీంరావు రాంజీ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను (Ambedkar death anniversary) మండలంలో అంబేద్కర్ సంఘం, నేతకాని సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రం ఐబీలో అంబేద్కర్ చిత్రపటానికి, కాసిపేటలో నేతకాని సంఘం ఆధ్వర్యంలో, మండలంలోని పలు గ్రామాలలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దళిత నాయకులు మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు జాడి పోశం, వివిధ పార్టీల నాయకులు, తదితరులున్నారు.