జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti ) వేడుకను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి , బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి ( Former Minister Laxmareddy ) జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ, పాత బజారు, కొండేడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ జయంతి భారతరత్న , రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మన దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణ్యుడుగా అంబేద్కర్ ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కులాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలి. అది మనందరి బాధ్యతని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకున్నామన్నారు. పరిపాలనకు గుండెకాయ లాంటి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టుకున్నామని వెల్లడించారు.