అమర్దీప్ చౌదరి, శైలి జంటగా నటించిన కామెడీ లవ్‌స్టోరీ ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకుడు. సాయిసుధాకర్ కొమ్మాలపాటి నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాకోసం నాతో ప్రయాణం చేసిన టీమ్ మొత్తానికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. హీరో అమర్దీప్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు.
హీరోయిన్ శైలి కూడా తెలుగు నేర్చుకొని మరీ నటించింది. వీరందరి సహకారమే ఈ సినిమా విజయానికి కారణం’ అని అన్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఇలాంటి చిత్రానికి నిర్మాతనైనందుకు గర్విస్తున్నానని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇదని, కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుందని నిర్మాత సాయిసుధాకర్ తెలిపారు. హీరోహీరోయిన్లు అమర్దీప్, శైలీలతోపాటు చిత్రబృందం అంతా మాట్లాడారు.