హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.145 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అమర రాజా బ్యాటరీస్. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.193.69 కోట్లతో పోలిస్తే 25.25 శాతం తగ్గినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,365.87 కోట్లకు పెరిగింది.