Ram | మాస్ మహరాజా రవితేజ హీరోయిన్ భాగ్య శ్రీ భోర్సే గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది ఈ చిన్నది. మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే కి తొలి సినిమా భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు వెళ్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్నకింగ్ డమ్ , దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో రూపొందుతున్న కాంత వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.ఒకవైపు తన గ్లామర్ తో , మరోవైపు డేటింగ్ రూమర్స్ తో భాగ్యశ్రీ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.
గత కొద్ది రోజులుగా భాగ్య శ్రీ బోర్సే, రామ్ డేటింగ్లో ఉన్నారంటూ అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిద్దరూ రాపో 22 సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని అనేక ప్రచారాలు జరుగుతున్నా దానిపై క్లారిటీ లేదు. తాజాగా రామ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రాపో 22 సినిమాలో భాగ్య శ్రీ ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే BB! ఈ ఏడాది నీకు ప్రేమ, విజయాలు, సంతోషం దక్కుతాయని ఆశిస్తున్నా. అందుకు నువ్వు అర్హురాలివి. Love ‘n’ Luck #RAPO” అని రామ్ పోస్ట్ చేశారు .
ఇప్పుడు ఆ ట్వీట్లో “BB” అని సంబోధించడం, అలాగే “Love ‘n’ Luck” అనే మాటలు అందరలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. వీరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉండవచ్చని అందుకే అలా షార్ట్ గా కోడ్ లాంగ్వేజ్‌లో ఏదో చెప్పి ఉంటాడని అంటున్నారు. అయితే BB అంటే భాగ్యశ్రీ బోర్సే అని షార్ట్ గా పిలిచి ఉంటాడు. కానీ కొంతమంది నెటిజన్లు మరోలా ఊహించుకుంటున్నారు. కాగా, మంగళవారం మే6న భాగ్య శ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయా చిత్రాల మేకర్స్ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే ది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ ఈమె స్వస్థలం. నటి కాకముందు పలు మోడల్ గా పలు కంపెనీలకు పని చేసింది.