మరికల్, జూన్ 15 : మరికల్ మండల కేంద్రంలో 1996 -97లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో చిన్ననాటి చిలిపి చేష్టలను, గత మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. తమకు పాఠాలు బోధించిన కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు మృతి చెందగా వారికి నివాళులు అర్పించారు.
అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులకు ఘనంఆ సన్మానం చేశారు. 28 ఏళ్ల తర్వాత ఒకరిని ఒకరు కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల ప్రాంగణంలో ప్రార్థన చేసి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.