Allu Sirish | టాలీవుడ్లో మరో స్టార్ హీరో త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. మెగా కుటుంబానికి చెందిన యువ హీరో అల్లు శిరీష్ తనకునిశ్చితార్థం జరిగిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నైనిక చేతిని పట్టుకొని దిగిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌గా ఉండగా, వారిద్దరి మధ్య ఉన్న అనురాగం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోను షేర్ చేస్తూ శిరీష్ ఒక ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. “నేడు మా తాతయ్య, నటరత్న డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా హృదయానికి దగ్గరైన ఓ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను నైనికాతో నిశ్చితార్థం జరుపుకున్నాను. ఇటీవల మా నానమ్మ మరణించారు. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని కోరుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండి ఉంటారు. మా కుటుంబాలు మా ప్రేమను ఆనందంతో ఆమోదించాయి,” అని తెలిపారు.
ఈ ప్రేమ కథ చాలా కాలంగా సీక్రెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. ఇటీవల పారిస్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిందని సమాచారం. నైనిక హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిగా చెప్పుకుంటున్నారు. అయితే ఆమె పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శిరీష్ తనకు మనసు ఇచ్చిన నైనికను ఎప్పుడు పరిచయం చేస్తాడా? వీరి పెళ్లి ఎప్పుడవుతుందా? అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట నిశ్చితార్థంతో వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచారు.