అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందనక్కర్లేదని స్పష్టం చేశాడు. అయితే క్వారంటైన్లో బన్నీ సోషల్ మీడియా ద్వారా తన పిల్లలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను సంతోషపరచిన విషయం తెలిసిందే.
తాజాగా అల్లు అర్జున్‌కు కరోనా నెగెటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు బన్నీ. 15 రోజులు క్వారంటైన్ తర్వాత నాకు నెగెటివ్ అని నిర్దారణ అయింది. నేను కోలుకోవాలని ప్రార్ధించిన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికి ధన్యవాదాలు. లాక్డౌన్ వలన కొద్దిగా కేసులు తగ్గే అవకాశం ఉంది. అందరు ఇంటి పట్టున క్షేమంగా ఉండండి. మీ ప్రేమకు ధన్యవాదాలు అని బన్నీ పేర్కొన్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much 🖤 pic.twitter.com/ubrBGI2mER
— Allu Arjun (@alluarjun) May 12, 2021
#AlluArjun has tested negative for COVID after 15 days of home quarantine. @alluarjun pic.twitter.com/mN16BtLgl0
— BA Raju's Team (@baraju_SuperHit) May 12, 2021