హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఎన్ఐటీలు సహా పలు విద్యాసంస్థల్లో సీట్ల భర్తీలో భాగంగా జా యింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) రెండోవిడత సీట్ల కేటాయింపు సోమవారం జరుగనున్నది. అక్టోబర్ 27న తొలివిడత సీట్లు కేటాయించారు. రెండో విడతలో సీట్లు పొందిన వారు నవంబర్ 2 నుంచి 3 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల అప్లోడింగ్, నవంబర్ 5లోపు జోసా అధికారులు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది 6 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, నవంబర్ 24తో మొత్తం సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియనున్నది. ఈ మధ్యకాలంలో విద్యార్థి నచ్చిన విద్యాసంస్థతోపాటు బ్రాంచీల్లో చేరే అవకాశం కల్పించారు.