Thief | రోమ్: ఇటలీ రాజధాని రోమ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ దొంగ (38)ను ఓ ఇంట్లోని టేబుల్‌పై కనిపించిన పుస్తకం ఆకర్షించింది. దీంతో చోరీకి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి పుస్తకం చదవడంలో అతడు మునిగిపోయాడు. మెలకువ వచ్చిన యజమాని (71) వచ్చి అతడిని తడితే కానీ ఈ లోకంలోకి రాలేదు. ఆయనను చూసి షాకైన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
అయితే అప్పటికే అతడు పోలీసులకు దొరికిపోయాడు. దొంగను అంతగా ఆకర్షించిన ఆ పుస్తకం పేరు ‘ది గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ రాశారు.
ఆన్లైన్ గేమ్ ఆడనివ్వలేదని తాళాలు, కత్తి మింగేశాడు!
పాట్నా: ఆన్లైన్ గేమ్స్ మోజు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ బ్యాటిల్ గేమ్‌ను ఆడనివ్వలేదని ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యుల మీద కోపంతో ఓ తాళం, తాళాల గుత్తి, ఓ కత్తి, రెండు నెయిల్ కట్టర్లను మింగేశాడు. కొన్ని గంటల తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించారు. గంటన్నరసేపు శస్త్ర చికిత్స చేసి, ఆయన మింగినవాటన్నిటినీ వైద్యులు బయటకు తీశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్ అమిత్ కుమార్ చెప్పారు. బీహార్‌లోని మోతీహారిలో ఈ సంఘటన జరిగింది.