లక్నో, ఫిబ్రవరి 10: లఖింపూర్ ఖీరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న లక్నో బెంచ్ ఈనెల 18న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా అశిష్‌కు బెయిల్ ఇస్తూ జస్టిస్ రాజీవ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. సరిగ్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రారంభమైన రోజునే ఆశిష్‌కు బెయిల్ రావడం అసక్తికరంగా మారింది. గతేడాది అక్టోబర్ 3న యూపీలోని లఖింపూర్‌లో వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.