నర్సంపేట, నవంబర్ 13: దారులన్నీ నర్సంపేటలోని సీఎం కేసీఆర్ సభకే వెళ్లాయి. పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీలు, బైక్‌లపై భారీగా తరలారు. పట్టణంలోని 24 వార్డులకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచే జనం పోటెత్తారు. రోడ్లన్నీ వాహనాలతో నిండాయి. పల్లెల జనంతో పట్టణంలోని అన్ని వార్డుల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సీఎం కేసీఆర్ రానుండడంతో ఓపికగా ఉండి సాయంత్రం వరకు సభ ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకున్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని భోజ్యనాయక్తండాలో ర్యాలీని సర్పంచ్ భూక్య లలితా వీరునాయక్ ప్రారంభించారు. ద్వారకపేటలో వార్డు కౌన్సిలర్లు మినుముల రాజు, రామసహాయం శ్రీదేవి, దాసరిపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వల్లాల కర్ణాకర్‌గౌడ్, రాజపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఇటుకాలపల్లి, నర్సింగాపురంలో సర్పంచ్ మండల రవీందర్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, మాదన్నపేటలో సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, మాజీ సర్పంచ్ ఆకుతోట కుమారస్వామి, లక్నెపల్లిలో సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాత్కాల కొమ్మాలు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, శ్యాంసుందర్, రామవరంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, గురిజాలలో సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారు శ్రీలత, కమ్మపల్లిలో జడ్పీటీసీ కోమాండ్ల జయ, మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావతి జెండా ఊపి ర్యాలీలను ప్రారంభించారు.
నెక్కొండ: నర్సంపేటలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. నెక్కొండ నుంచి ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్య సరోజా హరికిషన్, పీపీ అబ్దుల్నభి, అధికార ప్రతినిధి కొమ్ము రమేశ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, కారింగుల సురేశ్, ఈదునూరి రమేశ్ తరలివెళ్లారు.
చెన్నారావుపేట: మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మండల ఎన్నికల ఇన్చార్జి రాయుడి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రఫీ, సీనియర్ నాయకులు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మెన్ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, కేతిడి వీరారెడ్డి ఆధ్వర్యలో భారీ ర్యాలీలతో వెళ్లారు.
ఖానాపురం: మండలం నుంచి 10వేల మందికి పైగా కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాలన్నీ గులాబీమయం అయ్యాయి.