– మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్
ఆలేరు టౌన్, ఫిబ్రవరి 2 : బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమని ఆ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కమలమ్మ జనార్ధన్ గార్డెన్ లో పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఆతెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత హామీలను ఓటర్లకు తెలియజేయవలసిన బాధ్యత బీఆర్ఎస్ సైనికులపై ఉందన్నారు. అలాగే కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. తెలంగాణ ప్రజలంతా కారే కావాలే, సారే రావాలని కోరుకుంటున్నారని, ఆలేరు, యాదగిరిగుట్టలో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, నాయకులు ఆడెపు బాలస్వామి, బేతి రాములు, మాదాన్ని ఫిలిప్, మొరిగాడి వెంకటేశ్వర్లు మాధవి, పోరెడ్డి జయ శ్రీనివాస్, బింగి రవి లతా, కోమళ్ల మౌనిక హరీష్, రాయపురం శ్రీనివాస్, పంతం కృష్ణ, యాట శివ, మోర్తాల సునీత రమణారెడ్డి, బీజని కళ్యాణి మధు, మోతే కనకమ్మ వెంకటేష్, కందుల బాబు పాల్గొన్నారు.