1987లో ‘ఆజ్’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు అక్షయ్‌కుమార్. 38ఏండ్ల తన నట జీవితంలో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రల్ని పోషించారాయన. అంతేకాదు, ఆయన సమకాలికుల్లో ఏడాదికి ఎక్కువ సినిమాల్లో నటించిన క్రెడిట్ కూడా అక్షయ్‌దే. ఈ కారణంగానే తక్కువ సమయంలోనే 200వ చిత్రానికి చేరవయ్యారాయన. నెల 9న అక్షయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 200వ చిత్రాన్ని అక్షయ్ ప్రకటించబోతున్నారని సమాచారం.
అభిమానులకు కానుకగా ఈ ప్రకటన ఉండబోతున్నదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారట. ఈ సినిమా వివరాలు అప్పుడే ప్రకటిస్తారని తెలిసింది. ఆయన నటించిన ‘జాలీ ఎల్ఎల్బీ 3’ చిత్రం ఈ నెల 19న విడుదల కానున్న విషయం తెలిసిందే.