లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400కుపైగా సీట్లను గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యోగిసర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ద్రవ్యోల్బణం రెట్టింపు అయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్త పెట్టకోవడం పొరపాటుగా అభివర్ణించారు. ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత క్రియాశీలకం కావాలని, అప్పుడు బీజేపీని మరింతగా ఎత్తిచూపవచ్చని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాష్ట్రంలో యోగి మళ్లీ అధికారంలోకి వస్తే.. అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అప్పుడు యోగి బీజేపీలో ప్రధాని అభ్యర్థి అవుతారని అఖిలేశ్ బదులిచ్చారు.