Akhanda 2 | కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు, కలెక్షన్లు, అవార్డుల గురించే చర్చ నడుస్తుంటుంది. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu). ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ.. ఒకదానికి మించి మరొకరు వసూళ్లతో హోరెత్తించాయి.
ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్టు కొట్టిన బోయపాటి-బాలయ్య మరోసారి అఖండ 2 (Akhanda 2). తో రెడీ అవుతున్నారని తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సారి భారీ స్థాయిలో రాబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాగా సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. తాజా టాక్ ప్రకారం సెప్టెంబర్‌లో సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. బాలకృష్ణ డ్యుయల్ రోల్లో నటించి.. టైటిల్ రోల్లో గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇక అఖండ 2లో కూడా ఇలాంటి గెటప్‌లోనే కనిపిస్తాడని తెగ చర్చించుకుంటున్నారు నందమూరి అభిమానులు.
2021 డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన అఖండ బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించింది. శ్రీకాంత్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. మరి సీక్వెల్లో ఎవరెవరు నటించబోతున్నారన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.