AIUDF | ఎన్నికల్లో లబ్ధి కోసమే తెరపైకి యూసీసీ : కాషాయ పార్టీపై ఏఐయూడీఎఫ్ ఫైర్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) పేర్కొంది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) పేర్కొంది. ఉమ్మడి పౌరస్మృతి అంశం (యూసీసీ)పై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఏఐయూడీఎఫ్ విమర్శలు గుప్పించింది.
కేంద్ర ప్రభుత్వం యూసీసీని ఎలా తీసుకువస్తుందో తనకు అర్ధం కావడం లేదని, ఏ అంశం లేకపోవడంతో త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ యూసీసీని ముందకు తెస్తోందని ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమినుల్ ఇస్లాం ఆరోపించారు. బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. తమ పార్టీ యూసీసీకి వ్యతిరేకమని, దీన్ని ఎప్పటికీ తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం, మతం ఆధారంగా బీజేపీ ప్రజలను విభజిస్తోందని మండిపడ్డారు. ఈశాన్య ప్రాంతంలో తనకు అనుకూల పరిస్ధితి లేకపోవడంతో వర్గాల మధ్య అంతరం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూరగాయల ధరల పెరుగుదలకు మియా ముస్లింలు కారణమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారని అమినుల్ ఇస్లాం గుర్తుచేశారు.
Read More :
Abhishek Bachchan | రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. త్వరలో సమాజ్‌వాది పార్టీలో చేరిక..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- AIUDF
- asaam
- law commisison
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

