జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలి
దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్ల తొలగింపునకు కారణమైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
-
ఓయూలో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్ల తొలగింపునకు కారణమైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఫేస్ మాస్ ధరించిన వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సరార్ సీఈసీని పావుగా వాడుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా తొలగిస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, సహాయ కార్యదర్శులు నెల్లిసత్య, వంశీవర్ధన్ రెడ్డి, ఓయూ అధ్యక్షుడు ఉప్పల ఉదయ్ కుమార్, నాయకులు అశ్వన్, దొండి రామ్, అన్వర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

