ఫ్లోరిడాలో ఎయిర్ షో సందర్భంగా విమానం ఒకటి అత్యవసరంగా సముద్రంలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన నుంచి విమానం సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. సముద్రంలో ల్యాండ్ అయిన ఈ విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది కావడం విశేషం.
ఫ్లోరిడాలోని కోకో బీచ్ వెంట సముద్రంలో ఎయిర్ షో జరుగుతున్నది. పలు విమానాలు, హెలికాప్టర్లు గాలిలో చక్కర్లు కొడుతూ బీచ్‌కు వచ్చిన పర్యాటకులను అలరిస్తున్నాయి. ఇంతలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానం ఒకటి రయ్ మంటూ పెద్ద శబ్ధం చేస్తూ వచ్చింది. ఇంతలో ఏదో సాంకేతిక సమస్య ఎదురవడంతో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు పైలట్ చూశారు. అయితే, చుట్టూ సముద్రం తప్ప భూమి లేకపోవడంతో చేసేదేమి లేక నీటిలోనే విమానాన్ని దింపాడు. ఈ ఘటనలో పైలట్ గానీ, ఇతరులు గానీ గాయపడలేదు.
ఇప్పుడు దీనికి సంబంధించిన 46 సెకన్ల నిడివి గల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో విమానం నెమ్మదిగా సముద్రం మీదుగా దిగి ఆగిపోయింది. ఎయిర్‌షోను వీక్షిస్తున్న వారు హా..! అంటూ విచారం వ్యక్తం చేస్తుండటం వినిపించింది.
New video shows the moment a plane performing in the Cocoa Beach Air Show crash landed in the ocean: https://t.co/IBDGseZfOL pic.twitter.com/8glm7yJyks
— WESH 2 News (@WESH) April 17, 2021
ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకున్నది. పైలట్ తప్పిదం కారణంగానే విమానాన్ని అలా సముద్రం నీటిలో దింపాల్సి వచ్చిందని ఒకరు కామెంట్ చేయగా.. విమానం నడుపుతున్న పైలట్ హీరో అని, ఎవరికి ఏమీ కాకుండా వ్యూహాత్మకంగా సముద్రంలో విమానాన్ని ల్యాండ్ చేశాడని మరో నెటిజెన్ కితాబిచ్చాడు. ప్రయాణికులతోపాటు విమానాన్ని ఇప్పుడు సముద్రం నీటిలోకి అనుమతిస్తున్నారు.. అంటూ ఇంకో నెటిజెన్ చిలిపి కామెంట్ చేశాడు.
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..