Air India | దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో విమాన ప్రమాదం తర్వాత నుంచి ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు (technical snag) తలెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది.
AI2487 విమానం ఇవాళ ఉదయం దేశరాజధాని ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశారు. అనంతరం అధికారుల అనుమతితో విమానాన్ని భోపాల్ (Bhopal) మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం భోపాల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే.. సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read..
Air Pollution | వరుసగా మూడో రోజూ.. అధ్వానస్థితిలోనే గాలి నాణ్యత
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి