Chinmayi | టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ది గర్లఫ్రెండ్. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కథానాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు రాహుల్. అయితే ఇందులో భాగంగానే మంగళసూత్రం (తాళి) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాహుల్.
రాహుల్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత మంగళసూత్రం (తాళి) వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవద్దనే తనకు చెబుతాను. ఎందుకంటే పెళ్లి అయిన అనంతరం అమ్మాయిలకు తాళి ఉన్నట్లు అబ్బాయిలకు ఎటువంటి ఆధారం లేదు. ఇది ఒక వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధన కేవలం మహిళలకు మాత్రమే ఉండటం సరికాదంటూ రాహుల్ చెప్పుకోచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరూ రాహుల్ మాటాలను సమర్థిస్తుండగా.. మరికొందరూ వ్యతిరేకిస్తున్నారు.