రాజాసింగ్ వ్యాఖ్యల్ని ఖండించిన ఎంపీ అసదుద్దీన్
న్యూఢిల్లీ: ఓ వర్గం వారిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. హైదరాబాద్‌లో శాంతి వాతావరణాన్ని బీజేపీ కాంక్షించడం లేదని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తుందని అసద్ ఆరోపించారు. భారత్‌లో ఉన్న సామాజిక భినత్వాన్ని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన పేర్కొన్నారు. తమతో పోరాటం చేయాలనుకునేవాళ్లు రాజకీయ పోరాటం చేయాలని, కానీ ఇలా కాదు అని అసద్ అన్నారు. ఒకవేళ ప్రధాని మోదీ, బీజేపీ ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వకుంటే అప్పుడు వాళ్లు రియాక్ట్ కావాలన్నారు. సర్ తన్ సు జుదా నినాదాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు అని ఎంపీ అసద్ అన్నారు.
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీ రాజాసింగ్‌ను ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేసిన రాజా సింగ్ దాంట్లో ఓ వర్గం వారిపై కామెంట్ చేశారు. దబీర్‌పురా పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఐపీసీలోని 153, 153A, 188, 121, 295A, 298, 505 (1) (B) (C), 505 (2), 506 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

