మారేడ్‌పల్లి, ఫిబ్రవరి 7 : సికింద్రాబాద్ అమృతవాణి నిలయంలో సోమవారం ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) తెలంగాణ రాష్ట్ర శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా రెవరెండ్ డాక్టర్ జీకే బాబు, ఉపాధ్యక్షులుగా బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్, ఎన్.ప్రదీప్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి.శామ్యుల్ జాన్, సహాయ కార్యాదర్శిగా ఎన్డీ జాన్ సుందర్రాజ్, రాష్ట్ర కోశాధికారిగా వనితాఅలెగ్జాండర్, స హాయ కోశాధికారిగా మంగేశ్వరి, కో ఆర్డినేటర్‌గా ఏకే గిడియోన్బాబు, కార్యనిర్వాహక కార్యదర్శిగా పీఎస్ ప్రవీణ్ కుమార్, అధికార ప్రతినిధిగా రెంవరెండ్ డాక్టర్ గోపాల్‌నాయక్, ప్రచార కార్యదర్శిగా గ్రేస్ నిర్మల ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రెవరెండ్ కడారి డేవిడ్, సుప్రీంకోర్డు న్యాయవాది డాక్టర్ జన్ను వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఫాదర్ ఆర్లగడ్డ జోసఫ్, అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ సుధాకర్, ఏఐసీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షురాలు అమూల్ రజని, తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారులు బిషప్ డాక్టర్ ఆరోస్, తదితరులు పాల్గొన్నారు.