న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడంపై విమర్శలు చేశారు. నగరాల తర్వాత ఇప్పుడు గ్రామాలు కూడా దేవుడి దయపై ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. గ్రామాల్లో కరోనా కేసుల తీవ్రతకు సంబంధించిన వార్తా కథనం గురించి అందులో పేర్కొన్నారు.
शहरों के बाद, अब गाँव भी परमात्मा निर्भर! pic.twitter.com/KvJxN6fRIU
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2021