Telangana Bhavan | తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన (Spl.A) శాఖ ఈ మేరకు జీఓ ఆర్టీ నెం.1441ను ఈ నెల 3న జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయానికి ప్రత్యేక కార్యదర్శిగా అద్వైత్ కుమార్ సింగ్ పనిచేస్తున్నారు.
రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను ఆయన కొనసాగించనున్నారు.