అటవీ అధికారుల నుంచి భద్రత కల్పించండి
‘తరతరాలుగా తమకు జీవనాధారమైన పోడు భూములను సాగు చేసుకోలేకపోతున్నాం.. గుడిసెల స్థానంలో ఇండ్లు కట్టుకోలేకపోతున్నాం.. నీటి కోసం బోర్లు కూడా వేసుకోలేని పరిస్థితి.. గ్రామాలకు రోడ్లు వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారు.. మూడేండ్ల నుంచి అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి.. వారి నుంచి భద్రత కల్పించాలి’ అని ఆదివాసీలు కుమ్రం భీం వర్ధంతి సభలో మంత్రులను వేడుకున్నారు.
- కుమ్రం భీం వర్ధంతి సభలో మంత్రులను వేడుకున్న ఆదివాసీలు
- వచ్చే వర్ధంతినాటికి పరిష్కరిస్తామన్న మంత్రులు సీతక్క, లక్ష్మణ్
- నక్సలైట్లు లేకపోవడంతోనే అధికారుల వేధింపులు: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘తరతరాలుగా తమకు జీవనాధారమైన పోడు భూములను సాగు చేసుకోలేకపోతున్నాం.. గుడిసెల స్థానంలో ఇండ్లు కట్టుకోలేకపోతున్నాం.. నీటి కోసం బోర్లు కూడా వేసుకోలేని పరిస్థితి.. గ్రామాలకు రోడ్లు వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారు.. మూడేండ్ల నుంచి అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి.. వారి నుంచి భద్రత కల్పించాలి’ అని ఆదివాసీలు కుమ్రం భీం వర్ధంతి సభలో మంత్రులను వేడుకున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం కుమ్రం భీం 86వ వర్ధంతిసభ నిర్వహించారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఐటీడీఏ పీవో మకరంద్, ఎస్పీ నిఖితాపంత్తోపాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కుమ్రం భీం ఆశయాలు నేటికీ నెరవేరడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంక్షల కారణంగా కనీసం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోలేకపోతున్నామని, తాగు నీటికోసం బోర్లు వేసుకునే అవకాశం లేకుండాపోయిందని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితాలో నుంచి ఆదివాసీల భూములు తొలగించాలని డిమా ండ్ చేశారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యలను వచ్చే వర్ధంతి నాటికి పరిష్కరించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ ప్రాంతా ల్లో అభివృద్ధికి అటవీ శాఖ అడ్డుకట్టగా మారిందని పేర్కొన్నారు. అడవుల్లో నక్సలైట్లు లేకపోవడంతో అటవీ అధికారుల వేధింపులు పెరిగిపోయాయని ఎమ్మెల్యే కోవలక్ష్మి చెప్పారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

