ఐఎన్టీయూసీ వర్సెస్ టీడబ్ల్యూయూ
తెలంగాణ ఆర్టీసీలో కాంగ్రెస్ పార్టీ కుంపటి పెట్టింది. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ.. కార్మికులను ఐక్యంగా కాపాడుకుంటున్న ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ)ని పక్కన పెట్టిన కాంగ్రెస్.. కొత్తగా పుట్టుకొచ్చిన టీడబ్ల్యూయూను భుజాన ఎత్తుకున్నది.
- గాంధీభవన్‌లో మీటింగ్‌కు వెళ్లొద్దని ఐఎన్టీయూసీ ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో కాంగ్రెస్ పార్టీ కుంపటి పెట్టింది. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ.. కార్మికులను ఐక్యంగా కాపాడుకుంటున్న ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ)ని పక్కన పెట్టిన కాంగ్రెస్.. కొత్తగా పుట్టుకొచ్చిన టీడబ్ల్యూయూను భుజాన ఎత్తుకున్నది. దీనికి తోడు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని పక్కనపెట్టి.. టీడబ్ల్యూయూకి ఓటు వేయాలని కోరడం, సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు లేఖ రాయడంతో విభేదాలు భగ్గుమన్నాయి.
ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏ యూనియన్ కావాలో తేల్చుకోవాలని అంటూనే ఉన్నారు. అయితే, తమకు ఐఎన్టీయూసీ కంటే.. టీడబ్ల్యూయూనే ముఖ్యమంటూ మంగళవారం గాంధీభవన్‌లో ఆ యూనియన్‌తో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయినట్టు ఎస్‌డబ్ల్యూయూ నేతలు అంటున్నారు. దీంతో ఆ మీటింగ్‌కు ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) నుంచి కార్మికులెవరూ వెళ్లొద్దని నేతలు ఆదేశాలు జారీ చేశారు. ఆ సమావేశానికి ఐఎన్టీయూసీకి ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

