40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?
‘ నేను చనిపోతే 40 కోట్లు చెల్లిస్తారా.. అలా అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం చావడానికైనా సిద్ధం’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆయన హాజరై మాట్లాడారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలంతా సీనియర్ లీడర్లని, పాలమూరు ఎమ్మెల్యేలంతా ఎక్కువగా మొదటిసారి గెలిచిన వారేనని చెప్పారు.
- సర్కార్‌కు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
- 30 వేల మందితో ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక
- మంత్రుల సెగ్మెంట్లకే బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణ
జడ్చర్ల, అక్టోబర్ 25 : ‘ నేను చనిపోతే 40 కోట్లు చెల్లిస్తారా.. అలా అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం చావడానికైనా సిద్ధం’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆయన హాజరై మాట్లాడారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలంతా సీనియర్ లీడర్లని, పాలమూరు ఎమ్మెల్యేలంతా ఎక్కువగా మొదటిసారి గెలిచిన వారేనని చెప్పారు.
మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లోనేమో బిల్లులు వస్తున్నాయని.. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు బిల్లులు రావడంలేదని వాపోయారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు జడ్చర్లలో 30 వేల మందితో సభ ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. ‘నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్అండ్బీ కాంట్రాక్టర్ చనిపోతే రూ.5 కోట్లు ఇచ్చారని, నేను చనిపోతే బిల్లులు ఇస్తానంటే ఆమరణ దీక్ష చేసి చనిపోతాను’ అని స్పష్టంచేశారు. అభివృద్ధి పనులకు నిధులు, చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుంటే 30 వేల మందితో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రూ.40 కోట్లు వెంటనే ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. బిల్లులు, నిధులు ఇవ్వకుండా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జిల్లాలోని ఎమ్మెల్యే అందరూ ఐక్యంగా ఉండి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసిన తర్వాతే డిండి గురించి ఆలోచించాలని కోరారు. ఉద్ధండాపూర్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే రైట్ కెనాల్ ద్వారా రాజాపూర్, బాలానగర్, కేశంపేట మండలాలకు నీళ్లువస్తాయని చెప్పారు. నల్లగొండ జిల్లా లీడర్లు, ఎమ్మెల్యేలు అందరూ తమకుతామే సీఎం క్యాండెట్ అని అనుకుంటారని.. కానీ పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం పేదల పక్షాన ఉంటూ వారి అభివృద్ధి కోరుకుంటారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

