ఎండిన పంటలకు సర్కార్‌దే బాధ్యత
ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు ప్రభుత్వానిదే బాధ్యత అని, ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులకు, కూలీలకు కరువు సాయం అందించాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు.
- ఎకరాకు రూ.25 వేల చొప్పున పంటల పరిహారం చెల్లించాలి
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు ప్రభుత్వానిదే బాధ్యత అని, ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులకు, కూలీలకు కరువు సాయం అందించాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు.
2014కు ముందు 2 లక్షల ఆయకట్టు పారే పాలమూరు జిల్లాలో 11 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు. ఈ మూడేండ్లలో కొత్తగా ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టును రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, కేవలం పది శాతం పనులు పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా.. ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందోనని పూర్తిచేయడం లేదని ధ్వజమెత్తారు. జూరాల డ్యామ్ పరిధిలో 2014లో 68,084 ఎకరాలు ఆయకట్టు ఉంటే కేసీఆర్ సర్కార్ వచ్చాక 1,04,741 ఎకరాలకు పెంచిందని తెలిపారు.
చెరువులు, కుంటల కింద 2014కు ముందు 84,410 ఎకరాల ఆయకట్టు ఉంటే కేసీఆర్ సర్కార్ 1,87,960 ఎకరాలకు నీళ్లిచ్చినట్టు చెప్పారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే 12 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు వచ్చేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పీఆర్‌ఎల్‌ఐని పడావు పెట్టి రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఆరు నెలల్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పి కనీసం కనిపించకుండా పోయిన ఆరుగురి మృతదేహాలను నేటికీ బయటకు తీయలేదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్‌కు ముందుచూపు లేకపోవడంతో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

