భైంసా/భైంసా టౌన్, ఆగస్టు 30 : సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాననుమంగళవారం సందర్శించారు. వార్డులన్నింటినీ పరిశీలించారు. ఏరియా దవాఖానకు రూ. 85 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. వైద్యులు సాధారణ ప్రసవాలకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలన్నారు. భైంసా మండలం వానల్పాడ్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో లోకేశ్వర్ రావు, ఆర్డీవో లోకశ్వర్ రావు, దవాఖాన సూపరింటెండెంట్ కాశీనాథ్, డాక్టర్ విజయానంద్, డాక్టర్ సురేందర్, ఎంపీడీవో గంగాధర్, ఎంపీపీ కల్పన జాదవ్, ఉప సర్పంచ్ దగ్డే ఈశ్వర్, సర్పంచ్ రాజన్న, కార్యదర్శి గాయత్రి, టీఆర్ఎస్ నాయకులు రాంకుమార్, గణేశ్ పాటిల్, రాహుల్ ఉన్నారు.