ఆదిలాబాద్ రూరల్, మార్చి 2 : విద్యార్థులు సైన్స్ రంగంపై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత సూచించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం చెకుముకి టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని ప్రశ్నించి తర్కించి ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కిరణ్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్ కుమార్, రవీందర్, ఏఎస్వో మహేందర్ రెడ్డి, సూరజ్రావ్, నాయకులు శ్రీధర్‌బాబు, శ్రీనివాస్, ఊశన్న పాల్గొన్నారు.
విద్యార్థి ప్రతిభ
ఆదిలాబాద్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో బోథ్ మండలం కౌఠ (బీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆకాశ్ ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నద్ధమై పోటీలో పాల్గొన్నాడు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. విద్యార్థిని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.