
సిరికొండ,నవంబర్ 18 :పాడి రైతులు వ్యవసాయంతో పాటు పశు సంపదపై దృష్టి సారించాలని జిల్లా పశు వైద్యాధికారి రంగారావ్ అన్నారు. మండలంలోని జాకీర్గూడ,లక్ష్మీపూర్ (కే)లో గురువారం పశువైద్యశిబిరాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 509 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పశు వైద్యశిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల ఇన్చార్జి పశువైద్యాధికారి గోవింద్ నాయక్, జూనియర్ వెటర్నరీ డాక్టర్ వినీల్, సహాయకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 18 : పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ గోపీకృష్ణ అన్నారు. మండలంలోని గిరిగాంలో గురువారం పశువైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శ్రీకాంత్, సర్పంచ్ గజానన్, ఉపసర్పంచ్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఉపసర్పంచ్ ఇంద్రదేవ, పశువైద్య సిబ్బంది, పశుపోషకులు పాల్గొన్నారు.
తలమడుగు, నవంబర్ 18 : మండలంలోని ఉమ్రి, కోసాయి, దహెగాంలో గురువారం పశువైద్య శిబిరాలు నిర్వహించారు. వెటర్నరీ డాక్టర్ దూద్‌రాం రాథోడ్, సిబ్బంది పశువులకు టీకాలు వేశారు. శిబిరంలో సర్పంచ్ సుభాష్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నార్నూర్, నవంబర్18: గాదిగూడ మండలం రాంపూర్‌లో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 400 పశువులకు సిబ్బంది టీకా వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం మహేశ్వరి, పశువైద్య సహాయకుడు ఆనంద్‌కిశోర్, నాయకుడు ఆత్రం వామన్,రైతులు ఉన్నారు.
భీంపూర్, నవంబర్18: భీంపూర్ పంచాయతీలో గురువారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఎద్దులు,ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాథోడ్ , సర్పంచ్ మడావి లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు ఉత్తంరాథోడ్ పాల్గొన్నారు.