
ఎదులాపురం,నవంబర్18: ఆదిలాబాద్ జిల్లాలో 40 షాపులకు 591 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్కాలనీ సమీపంలోని పాతజాతీయ రహదరి పక్కనున్న మారుతి వైస్ షాపునకు 47 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ స్టేషన్ల్ 354, ఇచ్చోడ 149, ఉట్నూర్ 88 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి సుమారుగా రూ.11.82 కోట్ల ఆదాయం సమకూరింది.
పారదర్శకంగా కేటాయింపు
పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ పరిధిలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నా రు. ఈ నెల 20న స్థానిక తానిషాగార్డెన్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామన్నారు. మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అబ్కారీ శాఖ పర్యవేక్షకులు రవీందర్రాజు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో 73 షాపులకు 1170 దరఖాస్తులు
మంచిర్యాల అర్బన్, నవంబర్ 18 : జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు 1169 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రిజర్వుడ్ దుకాణాలకు 295 మంది టెండరు వేశారు. గతేడాది 69 దుకాణాలకు 1190 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 21 దరఖాస్తులు తక్కువగా నమోదయ్యాయి. కాగా ఐదో నంబర్ దుకా ణం (హైటెక్ సిటీ ఏరియా)కు అత్యధికంగా 50 మంది పోటీపడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో 47 దుకాణాలకు 556 ..
నిర్మల్ అర్బన్, నవంబర్ 18 : జిల్లాలో 47 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు తెలిపారు. నిర్మల్ డివిజన్ పరిధిలో .. భైంసా డివిజన్ పరిధిలో.. దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం రోజు లక్కీ డ్రా తీయనున్నారు.
కుమం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 షాపులకు 643..
ఆసిఫాబాద్, నవంబర్18 : మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ గురువారం ముగిసింది. చివరిరోజు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లావ్యాప్తంగా 32 షాపులకు కాగజ్నగర్ పరిధిలో 374, ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో 246 మొత్తం 640 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున జిల్లా తరఫున ప్రభుత్వానికి రూ. 12.8 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదిలాఉంటే 5 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.