కాజీపేట, జూలై 8: కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 13 నుంచి అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ-కాచిగూడ-విజయవాడ మధ్య నడిచే (12713/12714) శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే (17201/17202) గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (1723 3/ 17234) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ ప్రయాణికల కోసం అదనపు 3ఏసీ బోగీలతో నడపనున్నట్లు తెలిపారు.