Adani Group : గౌతమ్ అదానీ (Gautham Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్ (Adani group) రాగల ఐదేళ్లలో ఎయిర్‌పోర్టుల (Airports) పై లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఏవియేషన్ సెక్టార్ (Aviation sector) ఏటా 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేయనుందన్న అంచనాల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్టులపై భారీ పెట్టుబడులకు ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని గౌతమ్ అదానీ చిన్న కుమారుడు, అదానీ ఎయిర్‌పోర్ట్స్ (Adani Airports) డైరెక్టర్ జీత్ అదానీ (Jeet Adani) వెల్లడించారు.
అదానీ గ్రూప్ ఈ నెల 25న నవీ ముంబై ఎయిర్‌పోర్టులో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ గ్రూప్ ఎక్స్‌పాండింగ్ పోర్టుఫోలియోలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తగా చేరుతోంది. ఈ ఎయిర్‌పోర్టును నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (NMIAL) అభివృద్ధి చేసింది. NMIAL లో అదానీ గ్రూప్‌కు 74 శాతం వాటా ఉంది.
ఈ ఎయిర్‌పోర్టును ప్రాథమికంగా రూ.19,650 కోట్ల వ్యయంతో, ఏడాదికి రెండు ప్రయాణికుల కెపాసిటీతో నిర్మించారు. తర్వాత దీన్ని ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికుల కెపాసిటీకి విస్తరించనున్నారు.