Adah sharma | బాలీవుడ్ చిన్నది ఆదా శర్మ అందానికి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. క్యూట్ లుక్స్‌తో ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉండే ఈ భామ నటనతోను మంచి మార్కులు సంపాదించింది. అయితే ఇప్పటి వరకు ఆదా శర్మకి స్టార్ స్టేటస్ దక్కలేదు. 1920 అనే హారర్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ , అక్కడ అనేక చిత్రాలు చేసింది. అనంతరం తెలుగులోకి హార్ట్ ఎటాక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అంత పెద్ద హిట్ కాకపోయిన ఆదా నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ ఆఫర్ వచ్చినా వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా దూసుకుపోతుంది.
అయితే ఆదాకి మంచి పేరు తెచ్చిన చిత్రం కేరళ స్టోరీ .కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంతో దేశమంతటా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇందులో ఆదా నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.ఆదా తెలుగులోను వైవిధ్యమైన సినిమాలు చేసింది. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం , కల్కి తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సెకెండ్ ఫీమెల్ లీడ్ రోల్స్ చేసి అలరించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆదాశర్మ ఎప్పటికప్పుడు తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తూ ఉండేది.
తాజాగా ఆదా గాయాలతో కూడిన పిక్స్ షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఎంతో అందంగా ఉండే ముఖం ఇలా అయిందేంటున్నారు.. అయితే అవి ఇప్పటి ఫొటోలు కావు.. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ నాటి ఫొటోలు. ఈ మూవీ రిలీజై సోమవారం (మే05) నాటికి సరిగ్గా రెండేళ్లు గడిచిపోవడంతో అప్పటి జ్ఞాపకాలు పంచుకుంది. మనిషి మెదడు 75 శాతం నీటితో ఉంటుంది. డీ హైడ్రేషన్ దృష్టి, జ్ఞాపకశక్తి, మానసిక శక్తిని ఇది ప్రభావితం చేస్తుంది. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో జరిగిన కారణంగా, డీ హైడ్రేషన్ వలన నా పెదవులు మొత్తం పగిలిపోయాయి. నా మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలాయి. ది కేరళ స్టోరీ సినిమా కోసం నేను ఒక మంచి పోస్ట్ చేయాలని అనిపించింది. ఎన్నో ఫొటోలు, వీడియోలు ఉన్నా ఏది పోస్ట్ చేయాలో అర్ధం కావడం లేదు. కేరళ స్టోరీ చిత్రం మంచి మధుర జ్ఞపకాలని అందించిందని పేర్కొంది ఆదా