Actor Vijay | తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay) సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనలో కీలక నిందితుడుగా ఉన్న విజయ్‌కి సీబీఐ గతవారం సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు (CBI interrogation) హాజరయ్యారు. అధికారులు విజయ్‌ని విచారిస్తున్నారు.
కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో గత వారం విజయ్‌కి సీబీఐ అధికారులు సమన్లు పంపారు. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరవ్వాలని అందులో ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఇవాల ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న విజయ్.. అక్కడ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Also Read..
ISRO | పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం : ఇస్రో చైర్మన్
Air India | మెడికల్ ఎమర్జెన్సీ.. విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం జైపూర్‌లో ల్యాండింగ్
ISRO | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ62