Vijay Devarakonda | రివ్యూలు, రేటింగ్స్ వ్యవస్థపై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ..నిద్రలేని రాత్రులు గడిపానంటూ..
Vijay Devarakonda | టాలీవుడ్లో ఒకప్పుడు యూత్ ఐకాన్‌గా దూసుకెళ్లిన హీరో విజయ్ దేవరకొండ, ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌తో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడమే కాకుండా, ప్రతి రిలీజ్‌కు ముందే నెగిటివ్ ప్రచారం, రేటింగ్స్ పేరిట ముందస్తు తీర్పులు తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన గతంలోనే పలు సందర్భాల్లో వెల్లడించారు.
Vijay Devarakonda | టాలీవుడ్లో ఒకప్పుడు యూత్ ఐకాన్‌గా దూసుకెళ్లిన హీరో విజయ్ దేవరకొండ, ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌తో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడమే కాకుండా, ప్రతి రిలీజ్‌కు ముందే నెగిటివ్ ప్రచారం, రేటింగ్స్ పేరిట ముందస్తు తీర్పులు తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన గతంలోనే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. తెలుగు సినిమా రంగంలో ఆన్లైన్ రివ్యూలు, స్టార్ రేటింగ్స్ వ్యవస్థపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. సినిమా విడుదలైన క్షణాల్లోనే రేటింగ్స్ వెలువడటం, వాటి ఆధారంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలా వద్దా నిర్ణయించుకోవడం సాధారణమైపోయింది.
అయితే ఇదే విధానం కొన్నిసార్లు సినిమాల భవితవ్యాన్ని దెబ్బతీస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం జరగడం వల్ల నిర్మాతలు, దర్శకులు ఆర్థికంగా నష్టపోతున్నారని పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు అనుమతి లభించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందం కోర్టును ఆశ్రయించడంతో, ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్‌లో రివ్యూలు, స్టార్ రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో బుక్ మై షో తన ప్లాట్ఫామ్లో రేటింగ్స్‌ను నిలిపివేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిణామాలపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ, “ఈ వార్త చూసినప్పుడు ఒకవైపు సంతోషం… మరోవైపు బాధ కలిగింది” అని వ్యాఖ్యానించారు. ఎంతోమంది కృషి, పెట్టుబడిని కాపాడేందుకు ఇది కొంతవరకు ఉపయోగపడుతుందన్న ఆశ ఉందని, కానీ సినిమా రంగానికి చెందిన వారే ఇలాంటి సమస్యలకు కారణమవుతుండటం బాధాకరమని అన్నారు. ‘లివ్ అండ్ లెట్ లివ్’ అనే ఆలోచన పరిశ్రమలో ఎక్కడ మాయమైందని ప్రశ్నించారు. ‘డియర్ కామ్రేడ్’ రోజుల నుంచే వ్యవస్థీకృతంగా జరుగుతున్న నెగిటివ్ దాడులను తాను గమనించానని, అప్పట్లో తన మాటకు విలువ ఇవ్వలేదని విజయ్ గుర్తు చేసుకున్నారు. “మంచి సినిమా అయితే ఎవరూ ఆపలేరు అన్నారు. కానీ నాతో పని చేసిన నిర్మాతలు, దర్శకులు తర్వాత ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారు” అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే ఇది పూర్తి పరిష్కారం కాదని, గుడ్డిలో మెల్లలా మార్పు మొదలైందని వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన తన సినిమా ‘కింగ్డమ్’ కూడా నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్‌ను ఎదుర్కొందని ఆయన పరోక్షంగా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kingdom
- next movies
- ratings
- reviews
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

