ముంబై, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. బాంబే హైకోర్టు అతని ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరసరించడంతో, ముంబై సైబర్ సెల్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛత్తీస్‌గఢ్‌లో ఆయన్ను అరెస్టు చేసింది.
అంతకుముందు, 2023 డిసెంబర్లో సాహిల్‌తో పాటు మరో ముగ్గురిని సిట్ విచారణకు పిలిచింది. కానీ వారు హాజరు కాలేదు. కాంట్రాక్ట్ ప్రకారం తాను బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని సాహిల్ పేరొన్నారు. అయితే ఈ యాప్‌కు సహ యజమాని సాహిల్ అని పోలీసులు తెలిపారు.