వట్పల్లి, మే 13: బీఆర్ఎస్ ఎంపీటీసీపై కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాడి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎంపీటీసీ సంగన్న గ్రామస్తులకు ఓటరు స్లిప్పులు అందజేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీటీపై దాడి చేసినట్లు తెలిపారు.
దాడి చేయడమే కాకుండా కొద్దిదూరం వెంబడించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాంగ్రెస్ నేతలపై తగిన చర్యాలు తీసుకోవాలని ఎంపీటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.