
మహబూబ్‌నగర్, డిసెంబర్ 1 : కరో నా నియంత్రణలో భాగంగా ప్రజలకు వ్యాక్సిన్ అందించే కార్యాచరణను వందశాతం పూర్తి చేసేలా వెంటనే ప్రణాళికలను అమలు చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఒమిక్రాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీలోని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యా శాఖ మత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. కొవిడ్తోపా టు ఒమిక్రాన్‌ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 79 శాతం వ్యాక్సిన్ పూర్తయిందని తెలిపారు. వం ద శాతం పూర్తి చేసేందుకు పాలమూరు జిల్లాలో 6,500, నారాయణపేట జిల్లా లో 7,500 మందికి వ్యాక్సిన్ వేసేందు కు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీకా వేసుకోని వారి ఇంటికెళ్లి వేయాలన్నారు. పదిహేను రోజుల్లో వంద శాతం ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ సిబ్బంది, ఆశ, అంగన్వాడీ ఆర్పీలతో లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. నూ తన రేడియాలజీ, డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెంటనే స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్లో పెండింగ్‌లో ఉన్న ఆర్పీల సమస్యలు తీర్చాలని మంత్రి కేటీఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, వనజ, కలెక్టర్లు వెంకట్రావు, హరిచందన, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ.నర్సింహులు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డీఎంహెచ్‌వో కృష్ణ పాల్గొన్నారు.
టీకానే శ్రీరామరక్ష..
కరోనా నుంచి రక్షణ పొందాలంటే టీ కానే శ్రీరామరక్ష అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ స మావేశ మందిరంలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, అధికారులతో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రి స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రెండు డోస్‌ల వ్యాక్సిన్ ప్రక్రియను పదిహేను రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వైరస్ నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీకాలను ఉచితంగా వేయనున్నట్లు చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధిం చి మండలానికో ప్రత్యేక అధికారిని కే టాయిస్తూ ఉత్తుర్వులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. మున్సిపల్ వాహనాలు, చెత్త ఆటోలు, ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నా రు. స్వయం సహాయ, మహిళా సంఘా లు, మెప్మా గ్రూపులు, అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్లు వెంకట్రావు, హ రిచందన, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.